U19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఏకపక్ష విజయం సాధించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. కాగా ఈ విజయంలో తెలుగమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ కీలక మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చింది. 69 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 3 ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది టీమిండియా. షఫాలి వర్మ(15), శ్వేతా సెహ్రావత్ (5) త్వరగా వెనుదిరగ్గా, సౌమ్య తివారి (24), తెలుగు అమ్మాయి త్రిష(24) చివరీ వరకు ఉండి ఇండియాను గెలిపిందించింది. అయితే త్రిష మాత్రం నిలకడగా ఆడింది. స్పల్ప స్కోరు కావడంతో ఆచితూచి ఆడింది. మొత్తం 29 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేసి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచింది. 14 ఓవర్లలోనే భారత్ గెలవడం గమనార్హం. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతేకాదు హ్రిషిత బసుతో కలిసి మూడో వికెట్‌ను కీలకమైన 46 పరుగులను జోడించింది. అంతకుముందు ఫీల్డింగ్‌లో ఓ చురుకైన క్యాచ్‌ను పట్టి ఇంగ్లండ్ కెప్టెన్ గ్రేస్ స్క్రివెన్స్‌ను పెవిలియన్ పంపించింది. కాగా గ్రేస్ ప్రపంచకప్ టోర్నీలో పరుగుల వర్షం కురిపిస్తోంది. టోర్నీ మొత్తం ఆద్యంతం రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపికైంది. అలాంటి గ్రేస్‌ను అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ పంపించింది త్రిష. కాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రపంచకప్ టోర్నీలో నిలకడగా రాణించింది.
Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ
గ్రూప్ దశలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గొంగడి త్రిష(51 బంతుల్లో 57, 6ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచి టీమిండియాను గెలిపించింది. కాగా టీమిండియా జగజ్జేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తూ పలువురు పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా ఎనిమిదేళ్ల వయసులోనే అండర్-16లో త్రిష సత్తా చాటింది. 12 ఏళ్ల వయసులోనే అండర్-19 జట్టుకు ఆడి అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఆమె సాధించిన ఈ ఘనతను చూసి భద్రాచలం ప్రజలు, త్రిష అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అందరి ప్రశంసలు అందుకుంటోంది గొంగడి త్రిష.