ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ ముప్పు నుంచి రక్షించడానికి 2019లో రూపొందించిన చట్టం ప్రకారం "ట్రిపుల్ తలాక్" అని ఉచ్చరించినందుకు ఢిల్లీకి చెందిన వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయం నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆదివారం ఎన్నికయ్యారు. ఆయన తన దౌత్య, విదేశాంగ విధాన దృష్టితో సైప్రస్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యతలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇటీవల విమానాల్లో గొడవలు పడడం ఎక్కువైంది. విమానాల్లో తీసిన గొడవలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 33 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
కేప్‌టౌన్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
నిబంధనలను ఉల్లంఘించి ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) షోకాజ్ నోటీసులు జారీ చేసిన 20 మంది ఆన్‌లైన్ విక్రేతలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ కూడా ఉన్నాయి.