IndW vs PakW: కేప్‌టౌన్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రీడామణులు కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) అద్భుతంగా రాణించిన వేళ పాకిస్థాన్ భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలోనే భారత బౌలర్లు పాక్‌ను 12.1 ఓవర్లలో 68/4కు తగ్గించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాతో వార్మప్ గేమ్‌లో వేలి గాయంతో ప్రారంభ మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్మృతి మంధాన స్థానంలో హర్లీన్ డియోల్‌ను తీసుకున్నారు. పొడిగా ఉన్న వికెట్‌ని చూసి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తెలిపారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
బిస్మాహ్ మరూఫ్, అయేషా నసీమ్‌లు గతి తప్పిన బంతి వస్తే బౌండరీలు.. జాగ్రత్తగా వేస్తే సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. పాక్ బ్యాటర్లలో జవేరియా ఖాన్ (8), నిదా దర్ (0), సిద్రా అమీన్ (11), మునీబా అలీ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
Selling Drugs: ఆన్‌లైన్ ఔషధ విక్రేతలకు డీసీజీఐ నోటీసులు.. అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌తో సహా..
భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్
పాకిస్థాన్ మహిళల జట్టు: జవేరియా ఖాన్, మునీబా అలీ(w), బిస్మాహ్ మరూఫ్(c), నిదా దార్, సిద్రా అమీన్, అలియా రియాజ్, అయేషా నసీమ్, ఫాతిమా సనా, ఐమాన్ అన్వర్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్