Viral Video: ఎర్రబస్సు అనుకున్నారా?.. ఫ్లైట్‌లో బట్టలు ఊడేలా కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇటీవల విమానాల్లో గొడవలు పడడం ఎక్కువైంది. విమానాల్లో తీసిన గొడవలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.ఈ మధ్య కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తన శ్రుతి మించుతోంది. తాజాగా అలాంటి మరో ఘటన ఇక్కడ జరిగింది. సాధారణంగా మనం.. కిటికీ పక్క సీటు కోసం ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో తిట్టుకోవడం ఇంకా అలాగే కొట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఇప్పుడు విండో సీటు కోసం ఏకంగా విమానంలోనే ప్రయాణికులు చాలా దారుణంగా కొట్టుకున్నారు. ఫలితంగా రెండు గంటలపాటు ఆ విమానం ఆగిపోయింది. ఈ చెత్త ఘటన బ్రెజిల్‌లోని గోల్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది.
దీనికి సంబంధించిన వీడియోను మైక్ సింగ్‌టన్ అనే నెటిజన్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. స్థానిక మీడియా కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. గోల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సాల్వడార్-కాంగోన్‌హాస్ ఫ్లైట్‌లో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఒక మహిళా ప్రయాణికురాలు దివ్యాంగుడైన తన కుమారుడి కోసం విండో సీటుని అడగగా ఆ సీటులో కూర్చున్న ఆ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ..విండో సీటులో కూర్చున్న వ్యక్తిని తిట్టింది. ప్రయాణికుడి కుటుంబంపై బాగా విరుచుకుపడింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Petrol Pump Scam: హైకోర్టు జడ్జీకే ఝలక్ ఇచ్చిన పెట్రోల్ బంక్ సిబ్బంది
దీంతో ఇరువురి కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు పెద్ద ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన రెండు కుటుంబాలకు చెందిన 15 మంది విమానంలోనే చాలా దారుణంగా కొట్టుకున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. విమానం మధ్య వరుసలో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ చాలా దారుణంగా దాడులు చేసుకుంటూ అరాచకం సృష్టించారు. ఆ వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, విమాన కెప్టెన్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం కూడా చేశారు. తాను దాదాపు విమానం తలుపులు మూసివేయబోతున్న సమయంలో ఇలా గొడవ జరిగిందని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు.
Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy
— Mike Sington (@MikeSington) February 3, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!