INDW vs PAKW: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. పాక్ జట్టు తొలుత 150 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాటింగ్‌లో జెమీమీ రోడ్రిగ్స్ (53*) అర్థశతకంతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మ (33), రీచా ఘోష్ (31*) కూడా రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (16), యాస్తికా భాటియా(17) రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు, సదియా ఇక్బాల్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.
IndW vs PakW: ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్.. భారత లక్ష్యం 150
మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌జట్టు 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ (68*, 55బంతుల్లో), అయేషా నసీమ్ (43*, 25బంతుల్లో) రాణించడంతో పాక్ భారత్‌కు 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలోనే భారత బౌలర్లు పాక్‌ను 12.1 ఓవర్లలో 68/4కు తగ్గించారు. కానీ పాక్ ద్వయం అద్భుతంగా రికవరీ చేసింది. పాక్ బ్యాటర్లలో జవేరియా ఖాన్ (8), నిదా దర్ (0), సిద్రా అమీన్ (11), మునీబా అలీ (12) నిరాశపరిచారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.