Earthquake: సిక్కింలో తెల్లవారుజామున భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: సిక్కింలోని యుక్సోమ్‌కి వాయవ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు తెల్లవారుజామున 4.15కి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. అయితే ఇది చాలా చిన్న భూకంపం కిందే లెక్క. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4 దాకా ఉన్న భూకంపాలను చిన్నవిగా లెక్కిస్తారు. వీటి వల్ల గోడలు బీటలు వారడం వంటివి జరుగుతాయే తప్ప పెద్దగా నష్టం ఏదీ ఉండదు. కాకపోతే.. గత వారం టర్కీలో 3 భారీ భూకంపాలు రావడం వల్ల.. ఇలాంటి సమయంలో ఈ భూకంపం రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భూ ప్రకంపనలతో ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆదివారం అసోంలోనూ భూమి కంపించింది.
Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. ఇప్పటికే 34 వేలు దాటిన మృతుల సంఖ్య
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల వేలాదిమంది మరణించిన నేపథ్యంలో భారతదేశంలోని సిక్కిం, అసోంలలో భూప్రకంపనలు సంభవించినపుడు జనం తీవ్ర భయాందోళనలు చెందారు. అసోంలో సంభవించిన భూకంపం ఘటన జరిగిన మరునాడే సిక్కింను భూప్రకంపనలు వణికించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర కలవరపడ్డారు. భూమి కంపించినపుడల్లా ప్రజలు టర్కీ, సిరియా భూకంప విపత్తును గుర్తు చేసుకొని వణుకుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మణిపూర్‌లోని ఉఖ్‌రుల్‌లో కూడా రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది. అంటే.. ఈశాన్య రాష్ట్రాల భూమిలోపల ఫలకాలు కదులుతున్నాయన్నమాట. అవి భారీగా కదిలితే మాత్రం ఈశాన్యంలో భారీ భూకంపం రాగలదు.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..