ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది.
మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
అవామీ లీగ్ నాయకుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పు బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఉన్న ఆయనను అధికార పార్టీ నామినేట్ చేయడంతో.. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరూ లేకపోవడంతో, చుప్పు అప్రమేయంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని కరంపురాలోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్మాగారంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.