Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్‌లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్నేహపూర్వక క్రికెట్ గేమ్ ఆడారు. ఈ ఆటలో కేంద్ర మంత్రి సింధియా కొట్టిన షాట్ బీజేపీ కార్యకర్త తలకు బలంగా తగిలింది. దీంతో అతడి తలకు గాయంగా కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంత్రి కొట్టిన బంతిని క్యాచ్ చేసేందుకు వికాస్ మిశ్రా ప్రయత్నించాడు. కానీ అది తప్పి అతని నుదుటిపై పడింది. ఫలితంగా అతన తలకు గాయమై రక్తం కారింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. తలకు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఇటౌరాలో కొత్తగా నిర్మించిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక బీజేపీ కార్యకర్త ధీరజ్ ద్వివేది తెలిపారు. స్టేడియం ప్రారంభించిన తర్వాత స్నేహపూర్వకంగా ఆడినట్లు ఆయన వెల్లడించారు. వికాస్‌కు గాయాలైన వెంటనే ఆటను నిలిపివేసి, అతన్ని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. జ్యోతిరాదిత్య సింధియా, మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రాతో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
Read Also: Tripura Assembly Polls: త్రిపురలో త్రిముఖ పోరు.. ప్రారంభమైన పోలింగ్
ఈరోజు తెల్లవారుజామున, మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఒక విమానాశ్రయానికి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు, దీనికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. విమానాశ్రయానికి సుమారు రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన కార్యక్రమంలో వింధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్‌ను సింగ్రౌలీతో కలుపుతుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానంతరం దాని చుట్టూ 660 కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక సమూహాలు అభివృద్ధి జరగనుంది.
Local BJP worker Vikas Mishra hurt on forehead while trying to catch the ball hit by union minister Jyotiraditya Scindia in Rewa district of MP. After inaugurating cricket stadium in Itaura (Rewa) showcased his batting skills. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/S2VJQd4yKJ
— Anuraag Singh (@anuraag_niebpl) February 15, 2023