New Al Qaeda Chief: మాజీ ఈజిప్షియన్ ప్రత్యేక దళాల అధికారి, అల్ ఖైదాలో ఉన్నత స్థాయి సభ్యుడిగా ఉన్న సైఫ్ అల్-అదెల్ తలపై 10 మిలియన్ల డాలర్ల బహుమతిని యూఎస్ ప్రకటించింది. ఇప్పుడు కొత్త యూఎన్ నివేదిక ప్రకారం, ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా కొత్త చీఫ్‌గా సైఫ్ అల్-అదెల్ పోటీలేని నాయకుడిగా ఉన్నట్లు వెల్లడించింది. 2011లో దాని వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ హత్యకు గురైనప్పటి నుండి ఉగ్రవాద సంస్థను అమెరికా దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా గత సంవత్సరం కాబూల్‌లో యూఎస్ క్షిపణి దాడిలో మరణించినట్లు విశ్వసిస్తున్న ఐమాన్ అల్-జవహిరీకి అల్ ఖైదా అధికారికంగా వారసుడిని ప్రకటించలేదు. జనవరిలో యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారి జవహిరి వారసత్వం గురించి అస్పష్టంగానే ఉందని చెప్పినప్పటికీ, సమూహం నుంచి వచ్చే నష్టాలను అంచనా వేసే ఐక్యరాజ్యసమితి నివేదిక ఇలా చెప్పింది. నవంబర్, డిసెంబర్‌లలో జరిగిన చర్చలలో, అనేక సభ్య దేశాలు సైఫ్ అల్-అదెల్ నాయకుడిగా అల్‌ఖైదా పనిచేస్తోందని యూఎన్ అభిప్రాయపడింది.
జవహరి మరణం తర్వాత ప్రాణాంతక కార్యకలాపాలను జాగ్రత్తగా ప్లాన్ చేయగల, జిహాదీ నెట్‌వర్క్‌ను అమలు చేయగల వ్యూహాత్మక నాయకుడిని ఎన్నుకోవాలని సమూహంపై అల్ ఖైదా ఒత్తిడి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. సైఫ్ అల్-అదెల్ తన పూర్వీకుల మాదిరాగా కాకుండా.. అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రవాద సమూహంగా మార్చడంలో సహాయపడిన అదెల్ రహస్యంగా దాడులను ప్లాన్ చేసినట్లు నిపుణులు అంటున్నారు. టాంజానియా, కెన్యాలోని యూఎస్ రాయబార కార్యాలయాలపై బాంబు దాడుల్లో అతని పాత్రకు సంబంధించి యూఎస్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నవంబర్ 1998లో అదెల్‌పై అభియోగాలు మోపింది. ఈ బాంబు దాడుల్లో 224 మంది పౌరులు మరణించగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్రికాలో అల్‌ఖైదా కార్యకలాపాలు, శిక్షణా శిబిరాలను అతను ఏర్పాటు చేశాడు. 2002లో పాకిస్తాన్‌లో యూఎస్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యతో అతనికి సంబంధం ఉంది. అదెల్ ఇరాన్‌లో ఉన్నాడని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. డిపార్ట్‌మెంట్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సైఫ్ అల్-అదెల్ గురించిన సమాచారం అందించిన వారికి 10 మిలియన్ల డాలర్ల వరకు అందిస్తామని ప్రకటన విడుదల చేసింది.
Tax Survey At BBC Offices: బీబీసీ ఆఫీసుల్లో కొనసాగుతున్న ట్యాక్స్ సర్వే.. 48 గంటలకు పైగా..
ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ ప్రధాన అంగరక్షకుడిగా, తీవ్రవాదుల సీనియర్ శిక్షకుడు, జిహాదీ ఉద్యమంపై నిపుణుడైన అదెల్ తన సుదీర్ఘ తీవ్రవాద కార్యకలాపాలను 1981లో ప్రారంభించాడని సమాచారం. ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ అల్-సదాత్‌ను ఇస్లామిస్ట్ సైనికులు చేసిన హత్యలో ప్రమేయం ఉన్నట్లు అనుమానించబడ్డాడు. కైరోలో కవాతు టెలివిజన్‌లో ప్రసారం చేయబడింది. అల్‌ఖైదా అమెరికాపై సెప్టెంబరు 11, 2001న జరిపిన విమానదాడుల్లో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి అల్‌ఖైదాను అతను స్వాధీనం చేసుకున్నాడు.