Trump-Obama: ఒబామా చాలా తప్పు చేశారు.. ఆ వార్త లీక్ చేయడంపై ట్రంప్ అభ్యంతరం
- ఒబామా చాలా తప్పు చేశారు
- సీక్రెట్ వార్తను లీక్‌పై చేయడంపై ట్రంప్ అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీరును అధ్యక్షుడు ట్రంప్ తప్పుపట్టారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేయడంపై తప్పుపట్టారు. ఒబామా చాలా పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఒబామా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గ్రహాంతరవాసులు ఉన్నారని.. వారంతా నిజమైనవారేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రహస్య సమాచారం నుంచి తీసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఇదే వ్యవహారంపై ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ… ఒబామా తీరును తప్పుపట్టారు. గ్రహాంతరవాసుల జీవం ఉండవచ్చని చెప్పి రహస్య సమాచారాన్ని లీక్ చేశారని ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడికి సంబంధించిన నిఘా సమాచారం అని.. ఇప్పుడు సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు అయిందన్నారు. అయినా ఒక రహస్య సమాచారాన్ని ఎలా లీక్ చేస్తారు? అలా చేయకూడదు కదా? చాలా పెద్ద తప్పు చేశారు అని వ్యాఖ్యానించారు. గ్రహాంతరవాసులు ఉన్నారని మీరు నమ్ముతున్నారా? అని విలేకర్లు అడగ్గా.. ‘‘అవి నిజమో కాదో నాకు తెలియదు.’’ అని ట్రంప్ అన్నారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ఇది కూడా చదవండి: US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
ఇటీవల పోడ్‌కాస్ట్ హోస్ట్ బ్రియాన్ టైలర్ కోహెన్‌కు ఒబామా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అని అడిగినప్పుడు.. ‘‘వారు నిజమైనవారే… కానీ నేను వారిని చూడలేదు. వారిని … ఏరియా 51లో ఉంచడం లేదు.’’ అని అన్నారు. అయితే ఒబామా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన తర్వాత తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. విశ్వంలో మరెక్కడైనా జీవం ఉండవచ్చని కానీ తన అధ్యక్ష పదవిలో గ్రహాంతరవాసులతో సంబంధాలు ఉన్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు తనకు కనిపించలేదని ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చారు.
నెవాడాలో ఉన్న అమెరికా వైమానిక దళ రహస్య స్థావరమే ఏరియా 51. గ్రహాంతరవాసుల శరీరాలు, కూలిపోయిన అంతరిక్ష నౌకలను కలిగి ఉందని చాలా కాలంగా అంశంగా ఉంది. అయితే 2013లో వెల్లడైన CIA పత్రాలు ప్రకారం.. ఈ ప్రదేశం ప్రధానంగా అత్యంత రహస్య గూఢచారి విమానాలను పరీక్షించడానికి ఉపయోగించబడుతుందని నిర్ధారించాయి.
ఇది కూడా చదవండి: T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!