ఇంజినీర్లు, డాక్టరేట్ హోల్డర్లతో సహా 12 లక్షలకు పైగా అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లో దాదాపు 6,000 పట్వారీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్ల వయసు ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
పశ్చిమ బెంగాల్‌లోని కిషన్‌గంజ్ ప్రాంతంలోని సరిహద్దు ఔట్‌పోస్టు వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు.
గత వారంలో మూడు రోజుల పాటు ఢిల్లీ, ముంబైలో గల బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖ సర్వే కార్యకలాపాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బీబీసీని, దాని సంపాదకీయ స్వేచ్ఛను గట్టిగా సమర్థించింది.
Delhi Mayor: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల తర్వాత 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ కొత్త మేయర్‌గా నియమితులు కానున్నట్లు అధికారులు బుధవారం […]
భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరు పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సోమవారం సాయంత్రం రావల్పిండిలోని ఓ దుకాణం బయట హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం హత్యకు గురయ్యాడు.
ఓ వ్యక్తి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న యువతి అయితే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని భావించి స్నేహితుల సలహా మేరకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్తతో పాటు అతని కుటుంబసభ్యులకు స్వయంగా హల్వా చేసి పెట్టింది.