పంజాబ్‌లో తుపాకీ సంస్కృతిపై అణిచివేత కొనసాగిస్తూ భగవంత్-మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునివ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. భారతీయ వివాహ వ్యవస్థలో స్వలింగ వ్యక్తులతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండడం భారతీయ కుటుంబ యూనిట్ భావనతో పోల్చదగినది కాదని వెల్లడించింది.
ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్‌లో ధూమపానం చేసి ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అమెరికా పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు ఆదివారం తెలిపారు.
నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.
ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకనుంచి కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగాలని షాన్ మార్ష్ ఫిక్స్ అయ్యాడు.
వాణిజ్యం, పెట్టుబడులతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మార్చి 20, 21 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనం కోసం భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన బహుమతి. దీనిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవన నాణ్యత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్యకేసులో గుజరాత్‌లో సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. యూపీలోని ఆయన నివాసంలో ఉన్న పెంపుడు కుక్క ఆకలిదప్పులతో ప్రాణాలు కోల్పోయింది.