Man Smokes On Flight: ఎయిరిండియా విమానంలో ధూమపానం.. అమెరికా పౌరుడిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Smokes On Flight: ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్లో ధూమపానం చేసి ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అమెరికా పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు ఆదివారం తెలిపారు. 37 ఏళ్ల రమాకాంత్ మార్చి 11న విమానంలో అసౌకర్యానికి గురిచేసినందుకు ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 336 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. “విమానంలో ధూమపానం నిషేధించబడింది. కానీ అతను బాత్రూమ్కు వెళ్లగానే అలారం మోగడం ప్రారంభించింది. మేము అందరం బాత్రూమ్ వైపు పరిగెత్తినప్పుడు అతని చేతిలో సిగరెట్ ఉంది. మేము వెంటనే అతని చేతిలో నుండి సిగరెట్ విసిరాము. ఆపై రమాకాంత్ సిబ్బందిపై అరవడం ప్రారంభించాడు. మా సిబ్బందిపై అరుస్తుండగా.. ఎలాగోలా అతడిని తన సీట్‌కి తీసుకెళ్లాం.కానీ కొంతసేపటి తర్వాత విమానం తలుపు తీయడానికి ప్రయత్నించాడు.అతని ప్రవర్తన చూసి ప్రయాణికులంతా భయపడ్డారు. మేము అతనిని ఆపడానికి ప్రయత్నించాం. కానీ అతను ఇంకా ఎక్కువ చేశాడు. దీంతో మేము అతని చేతులు, కాళ్లు కట్టి సీటుపై కూర్చోబెట్టాము” అని ఎయిర్ ఇండియా సిబ్బంది సహర్ పోలీసులకు తెలిపారు.
Read Also: Public Swimming Pool: ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.. ఇక టాప్ లేపేయండి
Also Read
- ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
- 12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
- 10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
- Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
“ప్రయాణికులలో ఒక వ్యక్తి వైద్యుడు. అతను వచ్చి అతనిని తనిఖీ చేసాడు. అప్పుడు రమాకాంత్ తన బ్యాగ్‌లో మందులు ఉన్నాయని చెప్పాడు, కానీ మాకు ఏమీ కనిపించలేదు, అయితే బ్యాగ్‌ని తనిఖీ చేయగా ఒక ఇ-సిగరెట్ బయటపడింది” అని పోలీసులు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుడు రమాకాంత్‌ను సహర్ పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకుని ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడు, అమెరికా పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక మానసిక క్షోభకు గురయ్యాడా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి నమూనాను పంపామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
ONGC Gas Leak: కోనసీమలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కలకలం
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
IPL 2027: ఆల్ క్యాష్ ట్రేడ్.. సగం ధరకే రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేతను వదులుకున్న ఎస్ఆర్హెచ్!
-
Oppo Reno 17, Reno 17 Pro: 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ.. కొత్త Oppo Reno 17 సిరీస్ వచ్చేసింది!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
ట్రెండింగ్
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!