Gangster Atiq Ahmed: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్యకేసులో గుజరాత్‌లో సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. యూపీలోని ఆయన నివాసంలో ఉన్న పెంపుడు కుక్క ఆకలిదప్పులతో ప్రాణాలు కోల్పోయింది. మాజీ ఎంపీ అయిన అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ ఆజిమ్ గత ఎన్నికల్లో అలహాబాద్(పశ్చిమం) నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. 2005లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకేసులో అతిక్ అహ్మద్ నిందితుడు. ఉమేష్ పాల్ మరణించిన ఒక రోజు తర్వాత అతిక్, అతని భార్య షైస్తా పర్వీన్, వారి ఇద్దరు కుమారులు, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్‌ను ఓడించడం ద్వారా తన అరంగేట్రంలో అలహాబాద్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానంలో గెలిచిన నెలల తర్వాత రాజు పాల్ హత్యకు గురయ్యాడు.
Read Also: Madhya Pradesh: విద్యార్థుల్ని చర్చికి తీసుకెళ్లి బైబిల్ బోధించిన ప్రిన్సిపాల్.. కేసు నమోదు..
తనను ఉత్తరప్రదేశ్‌లోని జైలుకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్‌కౌంటర్‌లో చనిపోతాననే భయంతో అతిక్ అహ్మద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని జైలులో ఉన్న అతిక్ సోదరుడు అష్రఫ్ కూడా జైలు నుంచి బదిలీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. తనను జైలు నుంచి బయటకు తరలిస్తే చంపేస్తానని అష్రాఫ్ భయాందోళన వ్యక్తం చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ కోసం యూపీ పోలీసులు రూ.2.5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.
అతిక్ అహ్మద్‌కు విదేశీ జాతికి చెందిన ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ యూపీలోని చకియా ప్రాంతంలో ఉన్న అతిఖ్ ఇంట్లోనే ఉన్నాయి. అతడు జైలుపాలవడంతో ఇంట్లో ఉన్న ఆ కుక్కలకు చుట్టుపక్కల వారు తమను శిక్షిస్తారనే భయంతో ఆహారం పెట్టడంలేదు. దీంతో ఆకలి దప్పులతో అవి అలమటిస్తున్నాయి. వాటిలో బ్రౌనో అనే గ్రేట్ డానే జాతికి చెందిన శునకం ఆకలికి తాళలేక చనిపోయింది. మరో నాలుగు కుక్కల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది.