సమాజ్‌వాదీ పార్టీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను మాఫియా ద్వారా స్వాగతిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచి చంపేశాయి.
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి.
తూర్పు నాగా జాతీయ ప్రభుత్వానికి చెందిన 15 మంది తీవ్రవాదులు, దాని అధ్యక్షుడు తోషా మొసాంగ్‌తో సహా, ఆదివారం రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ముందు లొంగిపోయారు.
దాదాపు 400 మంది పర్యాటకులు సిక్కింలో భారీ హిమపాతం తర్వాత చిక్కుకుపోయారు. శనివారం సుమారు 100 వాహనాలు నాథులా, సోమ్‌గో సరస్సు నుంచి తిరిగి వస్తుండగా నిలిచిపోయాయి.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నాయకురాలిని ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ వ్యక్తి కన్న కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపె ప్రయత్నించాడు. కానీ విచిత్రమేంటంటే తాను దోచుకుంటోంది తన కన్న కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. గత ఏడాది నవంబర్‌లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో 45 ఏళ్ల వ్యక్తి తన టీనేజ్ కుమారుడిని దోచుకునేందుకు ప్రయత్నించాడు.