ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో విషాదం చోటుచేసుకుంది. యూపీ సంభాల్‌లోని చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలిపోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించగా.. 11 మందిని రక్షించారు.
లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.
హెచ్‌ఎస్‌సీ బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్‌తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్‌మెంట్ సిబ్బంది లీక్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు.
ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్, మలావిలో సంభవించిన వరదల కారణంగా 300 మందికి పైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న పోలీసు ఎన్‌కౌంటర్ల కారణంగా ప్రాణ భయంతో, మోటార్ సైకిల్ దొంగల ముఠా సభ్యుడు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని మన్సూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చేతిలో ప్లకార్డు పట్టుకుని లొంగిపోయాడు.
ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను బెదిరించి, లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై మహిళా డిజైనర్, ఆమె తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఫ్ఘాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 17 మంది బంగారు గని కార్మికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు నివేదికలు తెలిపాయి.