ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది.
మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్‌పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
లండన్‌లో ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. వయనాడ్ ఎంపీ విదేశీ గడ్డపై దేశాన్ని పరువు తీశారని అన్నారు.
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త కొవిడ్-19 వేరియంట్‌ను కనుగొన్నట్లు నివేదించింది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉప-వేరియంట్‌లు ఉన్నాయి.
దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్‌ను ఇన్‌చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు మార్చి 17న (నేడు) ఆశ్చర్యకరమైన సెలవు ప్రకటించింది. వేక్‌ఫిట్ సొల్యూషన్స్, హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ కంపెనీ, లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఇదివరకు లేఖ రాసింది.