వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా చాలా చూశాం. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేయసితో గొడవపడి తనను తానే శిక్ష వేసుకున్నాడు.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు.
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమారుడితో అప్పటివరకు హోలీ ఆడి ఆనందంగా గడిపిన దంపతులు.. స్నానం కోసం వెళ్లి బాత్‌రూంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ గురువారం తెల్లవారుజామున హ్యాక్ చేయబడింది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ (BLUR) కనిపించింది.
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను రష్యా కూల్చివేసింది. నల్ల సముద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మిలిటరీకి చెందిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అమెరికా చేరవేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.