Bus Accident: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఫ్ఘాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో బస్సు బోల్తా పడిన ఘటనలో కనీసం 17 మంది బంగారు గని కార్మికులు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు నివేదికలు తెలిపాయి. తఖర్ ప్రావిన్స్‌లోని చాహ్ అబ్ జిల్లా నుంచి అంజీర్ ప్రాంతంలోని బంగారు గని వద్దకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సమాచారం. అంజీర్ ప్రాంతంలోని చాహ్ అబ్ సెంటర్, బంగారు గనుల మధ్య ఈ ప్రమాదం జరిగింది. తాలిబాన్ చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్ ప్రకారం, బాధితులందరూ బంగారు గని కార్మికులే.
Read Also: Crime News: అద్దెకు ఉంటున్న వ్యక్తితో తల్లి అఫైర్.. అడ్డొచ్చిన కూతురిని అతి కిరాతకంగా..
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2020 నివేదిక ప్రకారం.. అఫ్గానిస్థాన్‌లో ఆ ఏడాది మొత్తం ప్రమాద మరణాలు 6,033గా ఉన్నాయి. ప్రపంచంలో ప్రమాద మరణాల పరంగా అఫ్గానిస్థాన్ 76వ స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్‌లోని దారుణమైన రోడ్లు, అంతగా అభివృద్ది చెందని రహదారులు కారణంగానే ఇక్కడ అంతగా రోడ్డు ప్రమాదాలు జరిగి.. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది.