జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ భారీ పేలుడు జరగగా.. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. దీంతో స్వర్ణ దేవాలయానికి సందర్శించడానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పేలుడు పదార్ధాలను, ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇద్దరు మావోయిస్టులు తమ తలపై రూ.11 లక్షల నజరానాను కలిగి ఉన్నారని ఆయన చెప్పారు.
వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 సోమవారం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. ల్యాండింగ్ సమస్య కారణంగా పది నిమిషాల పాటు మన దేశ పరిధిలో చక్కర్లు కొట్టింది. పేలవమైన వాతావరణం వల్ల పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా ఉంచింది. ఆ సమయంలో పైలట్.. విమానాన్ని 23 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాడు.
గ్యాంగ్‌స్టర్ తిల్లు తాజ్‌పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ (TNSP)లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో మూగ ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తమిళనాడుకు తిరిగి పంపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఆదివారం తెలిపారు.
ది కేరళ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది.. హైదరాబాద్ చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందినట్లుగా విచారణ సంస్థలు ధ్రువీకరించాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నా రులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.