Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద రెండో పేలుడు.. 24 గంటల్లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast Near to Golden Temple: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ భారీ పేలుడు జరగగా.. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. దీంతో స్వర్ణ దేవాలయానికి సందర్శించడానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపు 24 గంటల్లో స్వర్ణ దేవాలయం పరిసరాల్లో జరిగిన రెండో క్రూడ్ బాంబు పేలుడు ఇది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీస్ కమిషనన్ నౌనిహాల్ సింగ్ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు కమిషనర్ సహా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
Read Also: Robbery Attempt: రాంబిల్లి ఎస్బీఐలో దోపిడీకి యత్నం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“పేలుడు ఘటనను ధృవీకరిస్తున్నాము. ఇక్కడ పరిస్థితి సాధారణంగా ఉంది. యాంటీ విధ్వంసక, బాంబ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి కాలికి చిన్న గాయం అయ్యింది” అని అమృత్‌సర్‌లోని ఏడీసీపీ మెహతాబ్ సింగ్ చెప్పారు. పంజాబ్ డీజీపీ ఐఈడీ పేలుడు కాదని నిర్ధారించారు. ఇది తక్కువ తీవ్రత కలిగిన పేలుడు అని చెప్పారు.పేలుడు శబ్దం సమీపంలోని స్థానికులకు వినిపించింది. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కూడా కనిపించాయి. హెరిటేజ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పదార్థాన్ని, బాంబును దారంతో వేలాడదీయడంతో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ నివాసితులను భయాందోళనలకు గురిచేసింది, ఇందులో ఒక వ్యక్తి గాయపడ్డారు. గోల్డెన్ టెంపుల్‌కు ఒక కిలోమీటరు పరిధిలో పేలుడు శబ్దం వినిపించింది. పేలుడులో కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు, హెరిటేజ్ స్ట్రీట్‌లోని రెస్టారెంట్ చిమ్నీలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!