Saba Karim: “అభిషేక్‌కు ఇది పెద్ద పరీక్ష”.. వరుస డకౌట్లు.. చెత్త రికార్డుపై మాజీ సెలక్టర్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saba Karim: నేడు టీమిండియా సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఆదివారం అహ్మదాబాద్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టోర్నీలో ఇప్పటివరకు తన ఆటతీరుపై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ మంత్రం అభిషేక్‌ను వెనకేసుకు రావడం విశేషం. అయితే.. తాజాగా అభిషేక్ ఫామ్‌పై భారత మాజీ క్రికెటర్, మాజీ సెలెక్టర్ సయ్యద్ సబా కరీం (Saba Karim) స్పందించారు. అభిషేక్ తిరిగి పుంజుకునే సామర్థ్యం ఉందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
READ MORE: T20 World Cup 2026: సూపర్ 8 ఆడకుండానే సెమీస్‌లోకి భారత్.. ఎలాగో తెలుస్తే షాక్ అవుతారు!
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
తాజాగా ESPNcricinfoతో మాట్లాడిన సబా కరీం, అభిషేక్ కొంచెం ఓపికగా ఆడితే ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యర్థి బౌలర్లు అతని దూకుడు ఆటతీరుకు ముందుగానే సిద్ధంగా ఉంటారని, అందుకే తన ఆటలో చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదటి బంతి నుంచే భారీ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనే ఒత్తిడిని వదిలి, సూటిగా బ్యాట్ ఆడుతూ కాస్త సమయం తీసుకుంటే మళ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడని సూచించారు. “ఇది చాలా మంది ఆటగాళ్లు ఎదుర్కొనే దశ. అభిషేక్‌కు ఇది పెద్ద పరీక్ష. ఒకటి లేదా రెండు ఓవర్లు సెట్ అయితే తర్వాత తన సహజమైన దూకుడు ఆటతో పరిస్థితిని సులభంగా మార్చగలడు. ఆటతీరు పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు కానీ బౌలింగ్‌కు అనుగుణంగా కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి” అని కరీం తెలిపారు. ఇక అభిమానులు మాత్రం అభిషేక్ బ్యాటింగ్ మారాలని కోరుకుంటున్నారు. తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Gautam Gambhir: “అరే యార్.. మీరు ఎలా మేనేజ్ చేస్తారు?”.. అభిమానులతో గంభీర్ ఫన్నీ చిట్‌చాట్ వైరల్
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!