The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూడమని కోరినందుకు వ్యక్తిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ (VHP) సభ్యుడు అయిన బాధితుడు మందిర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతను ముగ్గురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) డేరావర్ సింగ్ మాట్లాడుతూ.. “తన వాట్సాప్ స్టేటస్‌లో సినిమాని ప్రశంసించడం ద్వారా తమ సమాజాన్ని అవమానించారని ఆరోపించిన ముగ్గురు వ్యక్తులు తనను శనివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా తనను అడ్డుకున్నారని బాధితుడు పోలీసులకు చెప్పాడు.” ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.
Read Also: Rakshita Suresh: ప్రముఖ సింగర్‌కి తప్పిన ప్రమాదం.. చావు అంచులదాకా వెళ్లి..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
కేరళ స్టోరీ గత ఏడాది నవంబర్‌లో టీజర్ విడుదలైన వెంటనే భారీ వివాదానికి దారి తీసింది. 32,000 మంది స్త్రీలు ఇస్లాం మతంలోకి మార్చబడి, తీవ్రవాదులుగా మార్చబడ్డారనేది చిత్రనిర్మాతలను వివాదంలోకి లాగుతున్న వారి ప్రధాన అంశం. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, కేరళలో మతపరమైన బోధన, హిందూ, క్రిస్టియన్ మహిళలను రాడికల్ ఇస్లామిక్ మతాధికారులు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే దాని చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ మహిళలను ఇస్లాంలోకి మార్చారని, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా వంటి దేశాలకు ఇస్లాం మతం కోసం పోరాడటానికి పంపబడ్డారని కేరళ స్టోరీ పేర్కొంది. దక్షిణాది రాష్ట్రానికి చెందిన 32,000 మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) రిక్రూట్ చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!