కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నూతన ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. ప్రాంతం, కులం, సీనియారిటీ, ఎమ్మెల్యేల మనోగతం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నిర్ణయించడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమవడంతో ఇద్దరు ప్రధాన పోటీదారులు-డీకే శివకుమార్, సిద్ధరామయ్య- పార్టీ హైకమాండ్‌తో వివరణాత్మక చర్చ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని జనసేన పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు ఉంటాయన్నారు.
నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు జలాశయంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది జరిగింది. 12 మందితో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు గల్లంతయ్యారు.
తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్ చేసింది.
టీడీపీ, జనసేనలతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను పవన్‌కల్యాణ్‌ను తీసుకువచ్చారని.. అదే విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
గర్భిణులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.