Twitter New CEO: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై చెప్పబోతున్నారు. ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. అయితదే ఈ రేసులో లిండా యాకరినో పేరు ముందుంది. అమెరికా కార్పొరేట్ వర్గాలకు సుపరిచితమైన లిండా యాకరినో కొత్త సీఈవో అంటూ ప్రచారం జరుగుతోంది. లిండా యాకరినో ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ హెడ్ లిండా యాకారినో ట్విట్టర్ కొత్త సీఈవోగా మారేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆమె ట్విటర్‌ను ముందుకు నడిపే బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఆమెతో మస్క్ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దాదాపు ఆమె పేరే సీఈఓగా ఖరారు కావొచ్చని ట్విటర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్‌బీసీయూ అడ్వర్టైజింగ్ సేల్స్ హెడ్‌గా, కంపెనీ యాడ్-సపోర్టెడ్ పీకాక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ను ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
గత నెలలో మియామీలో జరిగిన ఒక అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్‌లో లిండా యాకరినో ఎలాన్ మస్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. యాకరినో దశాబ్ధ కాలంగా ఎన్‌బీయూ యూనివర్సల్‌లో పని చేస్తున్నారు. అంతకు ముందు టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 19 సంవత్సరాలు సేవలందించారు. నెట్‌వర్క్ ప్రకటన విక్రయాల ఆపరేషన్‌ను డిజిటల్ భవిష్యత్తులోకి లాగడంలో ఘనత పొందారు. ఆమె లిబరల్ ఆర్ట్స్, టెలికమ్యూనికేషన్స్ చదివిన పెన్ స్టేట్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ట్విటర్‌లో మస్క్ చేస్తున్న మార్పులకు యాకరినో ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ట్విటర్ మస్క్ చేతికి వచ్చినప్పటి నుంచే ఆమె సీఈఓగా ఉండడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు సన్నిహితులు తెలిపారు. మరోవైపు యాకరినోతో పాటు ట్విటర్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి ఇంఛార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్ కూడా సీఈఓ రేసులో ఉన్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది.
Read Also: Twitter CEO: ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై.. కొత్త సీఈవో ఎవరో తెలుసా?
ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతోన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో తాను కార్యనిర్వహక అధ్యక్షుడిగా కొనసాగుతానని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.