Cyclone Mocha: మధ్య బంగాళాఖాతంలో వచ్చే ఆరు గంటల్లో మోచా తుఫాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. ఆ తర్వాత తుఫాను మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాలను బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని క్యుక్‌ప్యు మధ్య మే 14 మధ్యాహ్న సమయంలో సిట్వేకి దగ్గరగా అతి తీవ్రమైన తుఫానుగా మారి గరిష్టంగా 150-160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. తుఫాను దృష్ట్యా పశ్చిమ బెంగాల్‌లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన ఎనిమిది బృందాలను మోహరించారు.
Read Also: Earthquake: కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనం
ఎన్డీఆర్‌ఎఫ్ 2వ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ మాట్లాడుతూ.. “మోచా తుఫాను మే 12న తీవ్ర తుఫానుగానూ, మే 14న అత్యంత తీవ్రమైన తుఫానుగానూ మారుతుందని 8 బృందాలను నియమించాము. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెంది 200 మంది సిబ్బంది బెంగాల్‌లో మోహరించారు.” అని తెలిపారు. తుఫాను ‘మోచా’ దృష్ట్యా వాతావరణ సంస్థ గురువారం పలు ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు వర్షపాత హెచ్చరికలను జారీ చేసింది. మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకార, యెమెన్‌లోని ఒక చిన్న పట్టణం ‘మోచా’ పేరు మీదుగా తుఫానుకు ఈ పేరు వచ్చింది.