Man drinks inside police station : ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి కుర్చీపై కూర్చుని మద్యం గ్లాసులో పోసుకున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఆ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అధికారిని సస్పెండ్ చేశారు. ఘటన సహరాన్‌పూర్‌లోని ఖతా ఖేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇమ్రాన్ అనే వ్యక్తి ఫోటో నెట్టింట వైరల్ కాగా.. ఆ ఫొటోలో ఆ మద్యం సేవిస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సచిన్ త్యాగి కూర్చునే కుర్చీలో కూర్చుని మద్యం గ్లాసులో పోసుకోవడం కనిపించింది.
Read Also: Dead body in sack: లంగర్ హౌజ్ లో దారుణం.. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ
అసలేం జరిగిందంటే.. మార్చిలో హోలీ సందర్భంగా ఇమ్రాన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారి కుర్చీలో కూర్చుని మద్యం సేవించాడు. ఆ సమయంలో టేబుల్‌పై ‘చక్నా’ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఉంచబడ్డాయి. ఆ సమయంలో తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసుల వద్దకు చేరింది. ఈ ఫోటో పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే ఎస్‌ఎస్పీ విపిన్ తడా సచిన్ త్యాగిని సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా కొద్ది రోజుల క్రితం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.