CBSE Class 12 Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు ఆసక్తితో ఎదురుచూస్తోన్న CBSE 12వ తరగతి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు https://www.cbse.gov.in/ లేదా https://results.cbse.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకునే సమయంలో అడ్మిట్‌కార్డు, రిజిస్ట్రేషన్ వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి. సీబీఎస్‌ఈ ప్రకారం, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా నమోదైంది. దీంతో 2019లో వచ్చిన 83.40 శాతం ఉత్తీర్ణతను అధిగమించినట్లు అయింది. మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33 శాతం కాగా.. త్రివేండ్రం ప్రాంతం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉంది. 78.05 శాతంతో ప్రయాగ్‌రాజ్ జాబితాలో చివరి స్థానంలో ఉంది. బాలికలు 90.68 ఉత్తీర్ణతతో 6.01శాతం మంది బాలుర కంటే మెరుగ్గా ఉన్నారు.
ఫలితాలను ఎలా తెలుసుకోవాలంటే?
*విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లలో ఏదైనా ఒకదానికి లాగిన్ అవ్వాలి.
*తెరుచుకునే పేజీలో వారి రోల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పాఠశాల నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది.
*సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫలితం ప్రకటించబడుతుంది.
*ప్రదర్శించబడిన ఫలితాన్ని విద్యార్థుల సౌలభ్యం కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీబీఎస్‌ఈ బోర్డు 2023 ఫలితాలు Digilockerలో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ సర్వీసులో ఖాతా ఉన్నవారు ఫలితాలు ప్రకటించే ముందు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దీని కోసం విద్యార్థులు తమ పాఠశాలల సహాయం తీసుకోవచ్చు.సీబీఎస్‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్ష 2023 ఫిబ్రవరి 15- మార్చి 21 మధ్య నిర్వహించగా, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5, 2023 వరకు జరిగాయి. ఈ సంవత్సరం జనవరి 2- జనవరి 14 మధ్య సీబీఎస్‌ఈ 10, 12 తరగతులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించింది.
రిజల్ట్ లింక్1: https://www.cbse.gov.in/
రిజల్ట్ లింక్2: https://cbseresults.nic.in/