ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు.
రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు
కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.
ఎద్దులను మచ్చిక చేసుకునే క్రీడ ‘జల్లికట్టు’ అని, ఎద్దుల బండ్ల పందేలను అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర ఇటలీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీటమునిగాయి.
భారతదేశం రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నప్పటికీ.. ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్ స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఇంజిన్‌ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ఎంకే2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఇంజిన్‌ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి.
కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజును గురువారం తొలగించారు. ప్రస్తుత కేబినెట్‌లో కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి.
పాకిస్థాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు, పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ప్రకారం ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది.
బీజేపీ ఎంపీ రతన్ లాల్ కటారియా(72) గురువారం కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన చండీగఢ్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
2008 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నందున జైలు శిక్ష అనుభవిస్తున్న కెనడాకు చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియాలోని అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని జిల్లా కోర్టు అనుమతిచ్చింది.