RBI: రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు. దీంతో రెండో ట్రక్కు కూడా అక్కడే ఆగింది. ఆ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లు ఉండటంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై 17 మంది పోలీసులు ట్రక్కులకు ఎస్కార్ట్‌గా ఉన్నారు.
Read Also: Karnataka CM: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఏకైక డిప్యూటీ సీఎంగా డీకేఎస్.. పార్టీ అధికారిక ప్రకటన
Also Read
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, మరింత రక్షణ కోసం పోలీసులను పిలిచారు. జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీని అందించేందుకు రెండు లారీలు చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి విల్లుపురం బయలుదేరినట్లు తెలిసింది. ట్రక్కులలో ఒకటి చెడిపోవడంతో, భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు. తాంబరం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసన్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చెడిపోయిన లారీని గుర్తించారు. ట్రక్కును సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించి, గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించడం కొంతకాలం నిషేధించబడింది. మెకానిక్‌లు ట్రక్కును రిపేరు చేయలేకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి పంపించారు.
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!