న్యూ కలెడోనియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో శనివారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అదే ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం కోట్లమంది తిరుమలకు వెళ్తుంటారు. శ్రీనివాసుడికి భక్తితో ముడుపులు, కానుకలు చెల్లిస్తారు. కోరిన కోరికలు తీర్చే ఆ వైకుంఠ వాసుడిని దర్శించుకుని జన్మ ధన్యమైందని భావిస్తారు.
డబ్బుల కోసం కుటుంబాన్నే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన 24 ఏళ్ల యువకుడు తన తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపి వారి మృతదేహాలను కాల్చివేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కా గ్రామంలో చోటుచేసుకుంది.
న్యాయవాదుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన మరుసటి రోజే శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్‌ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు.