మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా , చెంగల్‌పట్టు జిల్లాల్లోని సంభవించిన కల్తీ మద్యం మరణాల సంఖ్య బుధవారానికి 21కి చేరింది. ఈ కల్తీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొంత మంది అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల లహరి పతివాడ.. ఐదు రోజుల క్రితం విధులకు వెళ్తూ అదృశ్యమయ్యారు. ఆ మరుసటి రోజే టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఒక్లహోమా రాష్ట్రంలో శవమై కనిపించారు.
ఎరువుల ధరలను పెంచకూడదని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. జూన్-సెప్టెంబర్ ఖరీఫ్ లేదా వేసవి సీజన్ కోసం రూ.1.08 లక్షల కోట్ల పంట-పోషక సబ్సిడీని ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో యూరియాతో సహా అన్ని కీలక ఎరువుల కోసం తగినంత నిల్వలు, ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నాలుగు రోజులుగా సాగిన రాజకీయ డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల తర్వాత బుధవారం అర్ధరాత్రి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు.
తమిళనాడులోని రాణిపేట్‌లో స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్‌కాట్) వద్ద చర్మశుద్ధి కర్మాగారానికి చెందిన డ్రైనేజీ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ముఖ్యమంత్రి పదవికోసం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
సవతి తల్లి ఒత్తిడి కారణంగా ఏడేళ్ల బాలుడిని నిద్రలోనే తండ్రి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన రెండవ భార్యతో గొడవల కారణంగా తన 7 ఏళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.