Suicide on Railway Track: ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. పట్టాలపై తలపెట్టి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ జంట ప్రేమికులా లేక భార్యాభర్తలా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. జంట ఆత్మహత్య చేసుకునే ముందు కూల్ డ్రింక్, కొబ్బరి నీళ్లు సేవించిన ఆనవాళ్లను రైల్వే పోలీసులు గుర్తించారు.
కూల్ డ్రింక్, కొబ్బరి నీళ్లలో ఏమైనా కలుపుకుని తాగారా అని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: YSRCP: ట్విటర్‌ను ఊపేస్తున్న వైసీపీ సోషల్ మీడియా సైన్యం
మృతులు పెద్దరావీడు మండలం బద్దీడుకు చెందిన వదినా మరుదులు రాములమ్మ, శ్రీనుగా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతి చెందిన జంట మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.