YSRCP: ట్విటర్‌ను ఊపేస్తున్న వైసీపీ సోషల్ మీడియా సైన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Social Media: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీకి గ్రామ స్థాయి వరకు క్యాడర్ చాలా ఉంది. గత మూడు ఎన్నికల నుంచి సీన్ మొత్తం మారింది. సోషల్ మీడియాదే ఇపుడు పై చేయిగా ఉంది.ఇక వైసీపీకి 2019 ఎన్నికల్లో అసలైన ప్రచారం అంతా సోషల్ మీడియాలోనే జరిగింది. చేతిలో ఫోన్ ఉన్న ప్రతీ వారి బుర్రలోకి వైసీపీని సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎక్కించేశారు. ఇపుడు కూడా అదే రకంగా పార్టీని జనాలలో ఉంచాలని తాము ప్రభుత్వంలో ఉంటూ చేసిన కార్యక్రమాలను కూడా జనంలో ఉంచాలని చూస్తోంది వైసీపీ.అందుకోసం సోషల్ మీడియా సైన్యాన్ని ఏపీ అంతటా భారీ ఎత్తున తయారు చేయడానికి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Read Also: Rs 2,000 Notes: మే 23 నుంచి రూ. 2,000 నోట్లను మార్చుకోవచ్చు.. క్లారిటీ ఇదిగో?
Also Read
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇదిలా ఉండగా వైసీపీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వైసీపీ సోషల్ మీడియా సైన్యం ట్విటర్‌ను ఊపేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి నాలుగు ఏళ్లు కావడంతో #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్ అయింది. ప్రారంభమైన పది నిమిషాల్లోనే జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తన నాలుగేళ్ళ పాలనలో వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సమాచారంతో ట్వీట్లను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు. ఆ ట్వీట్లను పార్టీ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్లకు దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వస్తున్నాయి.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!