Vande Bharat Express: రేపు అస్సాంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైలు ఈ ప్రాంత ప్రజలకు వేగంతో, సౌకర్యంగా ప్రయాణించే మార్గాలను అందిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని కూడా పెంచుతుందని ప్రకటన పేర్కొంది. న్యూ జల్పాయిగురితో గౌహతిని కలుపుతూ, రెండు ప్రదేశాలను కలుపుతున్న ప్రస్తుత వేగవంతమైన రైలుతో పోలిస్తే, ఈ రైలు సుమారు గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుంది. వందే భారత్ ఐదున్నర గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది, అయితే ప్రస్తుత వేగవంతమైన రైలు దూరాన్ని చేరుకోవడానికి ఆరున్నర గంటల సమయం పడుతుంది.
Read Also: America: అమెరికాకు ఊరట.. అప్పుల పరిమితి పెంపుపై అంతా సిద్ధం!
Also Read
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
182 కిలోమీటర్ల మేర కొత్తగా విద్యుదీకరించిన సెక్షన్లను కూడా ప్రధాని మోదీ అంకితం చేయనున్నారు. ఇది అధిక వేగంతో నడిచే రైళ్లు, తక్కువ రన్నింగ్ టైమ్‌తో కాలుష్య రహిత రవాణాను అందించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో నడిచే రైళ్లు మేఘాలయలోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అస్సాంలోని లమ్‌డింగ్‌లో కొత్తగా నిర్మించిన DEMU/MEMU షెడ్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. భారతీయ రైల్వే ప్రస్తుతం 21 రాష్ట్రాల పరిధిలో 34 సర్వీసులను నడుపుతోంది. జూన్ నాటికి మరో ఏడు రాష్ట్రాల్లో కనీసం ఒక సర్వీసును నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!