Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: కొత్తగా నియమితులైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన కార్యదర్శి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి దొంగలను ఎలా పిలవాలి అని ఎద్దేవా చేశారు. షాలిమార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇస్లామాబాద్ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా మళ్లీ తన ఇంటిపై దాడి చేసి పార్క్ చేసిన టయోటా హై లక్స్ ట్విన్ క్యాబిన్ మోడల్ 2011ని దొంగిలించారని, ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ కాలంలో తమ జీతాల కోసం పోలీసులు వాహనాలను చోరీ చేస్తున్నారని.. న్యాయవ్యవస్థ సభ్యులు, సివిల్ సర్వెంట్లు, దౌత్యవేత్తలు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోపించారు. “దొంగిలించబడిన నా వాహనంపై నేను ఎక్కడ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి? దొంగలను పట్టుకోమని దొంగలను అడగాలా?” అని ఆయన అన్నారు.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఒమర్ అయూబ్ ఖాన్ పీటీఐ పార్టీ సెక్రటరీ జనరల్‌గా శనివారం నియమితులయ్యారు. ఇది గొప్ప గౌరవమని, తాను పాకిస్తాన్, పీటీఐ పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని, పీటీఐ సభ్యుల అంచనాలను అందుకోవడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. గతంలో కూడా, మాలిర్ కాంట్ పోలీసులు జాతీయ అసెంబ్లీ (MNA) మాజీ సభ్యుడు జమీల్ అహ్మద్ ఖాన్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మే 9న అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేసి వారి ఇళ్లపై దాడులు చేశారు. అంతకుముందు, మాలిక్ వాజిద్, హాజీ షౌకత్ అలీ, అర్బాబ్ షేర్ అలీ, మురాద్ సయీద్, ఆయిషా బానోల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు ది ట్రిబ్యూన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. పోలీసుల దాడులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పీటీఐ విడుదల చేసింది. గతంలో పీటీఐ నేత ఉస్మాన్ దార్ నివాసంపై పోలీసులు దాడులు చేశారని పీటీఐ ఆరోపించింది. నాలుగు గోడల పవిత్రతకు భంగం కలిగించి దార్ సోదరుల తల్లిని వేధించారని పార్టీ పేర్కొంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!