ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యారు.
సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వజ్రపుతునకగా ఉన్న సింగరేణిని రెండు పార్టీలు నాశనం పట్టించాయని మండిపడ్డారు. వికలాంగుల ఫించను మరో వెయ్యి పెంచుతున్నామని సీఎం కేసీఆర్ మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రకటించారు.
శంషాబాద్ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు గురించి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు సాయికృష్ణను వేధించడంతో హత్య చేసినట్లు ఆయన తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. 2023 జూన్ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట.
గద్దర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు అనే చర్చ పార్టీలో జరగలేదని.. ఏదైనా అధిష్ఠానమే ఫైనల్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రియురాలిని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్ హోల్‌లో పడేసి చేతులు దులుపుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు.