Ponguleti Sudhakar Reddy: 15న ఖమ్మంకు అమిత్ షా.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Sudhakar Reddy: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. చైతన్యానికి మారు పేరు ఖమ్మం అని.. కేసీఆర్‌కు రాజకీయంగా దీటైన సమాధానం ఇస్తున్న పార్టీ బీజేపీ అని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ తొలి ఉద్యమం నడిచింది ఖమ్మం జిల్లాలోనే అని తెలిపిన పొంగులేటి.. అలాంటి జిల్లాలో అమిత్ షా మీటింగ్ పెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. అక్కడకి పోవాలా, ఇక్కడకి పోవాలా అని కొంత మంది వ్యాపారస్తులు ఉన్న ఈ జిల్లాలో, కమ్యూనిస్టు కంచుకోటలో, కాంగ్రెస్ ఇలాకాలో మనం బహిరంగ సభ పెట్టుకుంటున్నామని కార్యకర్తలకు తెలిపారు. జరగబోయే సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు దివానం లేదని, గెలిచిన వారు అమ్ముడు పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం..
ఎర్రటి ఎండలో యజ్ణం మొదలైందని.. పౌరుషానికి మారు పేరు ఈ నెల 15న జరగబోయే సభ అంటూ సుధాకర్ రెడ్డి తెలిపారు. జరగబోయే ఈ సభతో ప్రత్యర్థులకు వణుకు పుట్టాలన్నారు, రాక్షస, అక్రమ, కుటుంబ పాలన విముక్తి కలిగే విధంగా మనం పని చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను చిరుతపులితో పోల్చారు. చంద్రశేఖర్ రావు టక్కు టమార గోకర్న విద్యలు ఇక కుదరవన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
-
Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!