Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం బీజేపీ అడ్డా అని.. ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బీజేపీ సభతో కేసీఆర్‌కు దడ పుడుతుందని బండి సంజయ్ అన్నారు. అవసరం అయితే మోడీ సభను కొత్తగూడెంలో పెడతామన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ఎక్కడా బలమే లేదన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు జాకీ పెట్టినా లేవదని.. సర్వేలు అన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ను లేపడానికి బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Ponguleti Sudhakar Reddy: 15న ఖమ్మంకు అమిత్ షా.. బహిరంగ సభను విజయవంతం చేయాలి..
కొంతమంది పోలీసు అధికారులకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని.. బీజేపీ కార్యకర్తల్లో భయపడే వాళ్లు లేరన్నారు. సాయి గణేష్ త్యాగాన్ని విడిచి పెట్టమన్నారు. తెలంగాణలో మోడీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్ భయపడేది ఒక్క బీజేపీకి మాత్రమేనన్నారు. జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఆగడాలు జిల్లాలో ప్రజలు సహించలేకపోతున్నారన్నారు. రాముల వారిని కేసీఆర్ అవమానిస్తున్నారన్న బండి సంజయ్.. రాముల వారి కళ్యాణానికి రావడానికి కేసీఆర్‌కు సమయం లేదంటూ మండిపడ్డారు. కర సేవకుల త్యాగాలను మోడీ ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ సింగిల్‌గా అధికారంలోకి వస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.