CM KCR: మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను సీఎం కేసీఆర్ తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్ స్వీకరించారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్, పర్ధాన్‌పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రేఖా నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంచిర్యాలలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవం నేపథ్యంలో రెండో విడత గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ గొర్రెల పంపిణీని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. గొర్రెల పెంపకం వృత్తిగా జీవనం సాగిస్తున్న గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో సుమారు రూ.11 వేల కోట్ల వ్యయంతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి ఒక యూనిట్‌గా.. ఒక్కో యూనిట్ ధర రూ.లక్షా 25 వేలుగా నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం 75 శాతం అంటే రూ.93 వేల 750 భరిస్తుంది. లబ్ధిదారుడి వాటా ధనం 25 శాతం రూ.31 వేల 250 చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు గొర్రెల యూనిట్‌తో పాటు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!