పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కూ.315 కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆయన తెలిపారు.
దేశంలో అభివృద్ధి జరగాలంచే డబులు ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటుతో తుమ్మిడిహెట్టి వద్ద ఒక ప్రాజెక్టు, మేడిగడ్డ వద్ద మరో ప్రాజెక్టు ద్వారా అన్నారం, సుందీళ్ల, ఎల్లంపల్లికి నీటి మళ్లింపు చేసేలా మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. ఇలా గతంలో రెండు ప్రాజెక్టుల నిర్మాణంకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు.
అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు.
చంద్రబాబు పీ-4 మంత్రం చెబుతున్నారని.. మంత్రాలు కాదు కావాల్సింది, శక్తి యుక్తి కావాలని మంత్రి జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పేదవాళ్ల పక్షాన నిలబడతాడు.. పేదలను నిలబెడతారని మంత్రి పేర్కొన్నారు.