Schools Reopen: ఈ నెల 12 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Reopen in Telangana: తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. 2023 జూన్ 12 సోమవారం రోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. అంటే వేసవి సెలవులకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట. దాదాపు రెండు నెలల పాటు విద్యార్థులు సమ్మర్ హాలీడేస్ ను ఎంజాయ్ చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు తమ సొంత పట్టణాలకు చేరుకుంటున్నారు. సెలవులు పొడిగిస్తారనే వార్తల నేపథ్యంలో.. పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయని.. విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
Read Also: Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ సవాల్.. దమ్ముంటే వాళ్లకు సీట్లివ్వండి..
Also Read
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా.. రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. కాగా స్కూళ్లకు 2023 ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలావుండగా.. జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్)ను విద్యాశాఖ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని సూచించారు. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పించాలని పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పారు.
తాజావార్తలు
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!