Vallabhaneni Vamsi: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా మండిపడ్డారు. కాటికి కాలు చాపిన వారికి స్మశానమే గుర్తుకు వస్తుందన్న ఆయన.. చంద్రబాబు కాటికి కాలు చాపాడు కాబట్టి పేదలకు ఇస్తున్న సెంటు స్థలంను సమాధులతో పోల్చాడని మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువశాతం ఇళ్ళు నిర్మించుకొని గృహప్రవేశం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు.
Also Read: Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంకు తీవ్ర నష్టం చేకూరింది..
పేద ప్రజలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు పనికిమాలిన సన్నాసులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదని.. అలా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వాళ్ళను విమర్శించడానికి సిగ్గు ఉండాలని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకి ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు.. నమ్మకం లేకే దారిలో వెళ్లే అందర్నీ పోగేసుకొని కలిసి వెళదాం రండి అంటున్నాడని ధ్వజమెత్తారు. సినిమాలో చూస్తున్నట్లుగా చాలా మంది విలన్లు ఉంటారని.. కానీ హీరో ఉంటాడన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఫైట్ చేస్తాడన్నారు.