Auto Driver: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజక వర్గం భాకరాపేటలో ఆటో డ్రైవర్ దైర్య సాహసాలను ప్రదర్శించాడు. ప్రాణాలకు తెగించిన 8మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఆటోడ్రైవర్ సిద్ధయ్య పోలీసులకు పట్టించి పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆటోలో ఎక్కిన తమిళ స్మగ్లర్లను గుర్తించి నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు డ్రైవర్ సిద్దయ్య. స్టేషన్ బోర్డు చూసి ఆటోలో నుంచి దూకి స్మగ్లర్లు పరారయ్యారు. ఈ నేపథ్యంలో వారిని వెంబండించిన పోలీసులు 8 మందిని పట్టుకున్నారు.
Read Also: Karumuri Nageshwara Rao: పోలవరాన్ని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తాం..
వారి నుంచి రూ. 22లక్షల విలువైన 5 ఎర్ర చందనం దుంగలు, రెండు కార్లు, మూడు గొడ్డళ్లు, మూడు రంపాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ తంజీ కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్ల్ తంజీ పై రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క ఫోటోకి కూడా దొరక్కుండా తప్పించుకుని స్మగ్లర్ల్ తంజీ తిరుగుతున్నట్లు సమాచారం.