భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్, ఉమెన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అయిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (JCI) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్'ని పొందినట్లు వెల్లడించింది.
హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సమస్యను ఒక హిందూ సంస్థ లేవనెత్తిందని ఆదివారం ఒక అధికారి తెలిపారు.
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ (86) మరణించారని ఇటాలియన్ మీడియా సోమవారం తెలిపింది. దేశ రాజకీయ దృశ్యాన్ని మార్చడానికి ముందు ఇటలీలో అతిపెద్ద మీడియా కంపెనీని సృష్టించిన బిలియనీర్, వ్యాపారవేత్త అయిన సిల్వియో కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్నారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో 14,600 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.