MLC Jeevan Reddy: తెలంగాణ ఏర్పాటుతో తుమ్మిడిహెట్టి వద్ద ఒక ప్రాజెక్టు, మేడిగడ్డ వద్ద మరో ప్రాజెక్టు ద్వారా అన్నారం, సుందీళ్ల, ఎల్లంపల్లికి నీటి మళ్లింపు చేసేలా మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. ఇలా గతంలో రెండు ప్రాజెక్టుల నిర్మాణంకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎగువన ఉన్న తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్న దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి రూ. 1.26 లక్షల కోట్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆయన పేర్కొన్నారు. 9 ఏళ్ల నుంచి మహారాష్ట్రతో ఒప్పందం అయిపోయినా తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.
Also Read: CM Kejriwal : సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రజల తరఫున జరిగిన 8 ఏళ్ల పోరాటం ఫలించింది
వార్ధా, పెన్ గంగ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇక డొల్ల ప్రాజెక్టుగా మిగులుతుందని ఆయన ఆరోపించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి ప్రజానీకంను తప్పుడు తోవ పట్టిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు కదా.. 3 టీఎంసీల పేరుతో పెద్దపల్లి రైతులను మోసం చేస్తున్న విషయం నిజం కాదా ఈశ్వర్ అంటూ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. 1.5 టీఎంసీతో ఏర్పాటు చేస్తున్న రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీ భూములకు ప్రత్యమ్నాయ భూములు ఇవ్వకపోవడంతో కనీసం తూము కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఆర్బాటంగా ఏర్పాటు చేసిన దళిత బంధు 22-23 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని 1500 మంది నిరుద్యోగులకు 10 లక్షల రూపాయల చొప్పున 17,700 కోట్లు కేటాయించినా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బీసీల్లో కొందరికి రూ.లక్ష ఇస్తామని ప్రకటిస్తున్నారని, గడిచిన నాలుగేళ్లకు కలిపి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: AICC Sampath Kumar : కేసీఆర్ మీరు అలంపూర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
ఏ విషయం పైన అయినా ఎక్కడ చర్చ పెడతావో చెప్పు కొప్పుల ఈశ్వర్.. అక్కడ చర్చిద్దాం.. దేని మీద చర్చ పెడదామో చెప్పు అంటూ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారానే ఇప్పటికీ మూడు జిల్లాల్లో 7 లక్షల సాగు అవుతుందన్నారు. చక్కర ఫ్యాక్టరీనీ 100 శాతం ప్రభుత్వం పరంగా నడిపిస్తామని ఉద్యమ మాటగా చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ప్రాజెక్ట్ నివాసిత ప్రాంతాల వద్ద ఏర్పాటు చేయొద్దు అది కొప్పులకు తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్రిబ్ కో ప్రభుత్వ రంగ సంస్థ అయితే చక్కర ఫ్యాక్టరీ పునర్నిర్మాణం చేయించాలని డిమాండ్ చేశారు. కేవలం లాభాలు కోసమే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.