బెంగాల్ పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు జరిగిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం అనేక పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను రద్దు చేసింది. జులై 10, సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజా పోల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్‌లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
గుజరాత్‌కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు.
పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది.
దేశంలో రైల్వేశాఖ ఒకదాని తర్వాత ఒకటిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే ఫీడ్‌బ్యాక్ ప్రకారం వందేభారత్ రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు వందేభారత్ రైళ్లలో 25 మార్పులు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు.
రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) అధికారి, మధ్యప్రదేశ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మలా బుచ్ వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆదివారం ఇక్కడ మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి.
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో దాదాపు 12 మంది మరణించారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతం పెంచే జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి, గృహాలలో నీటి వినియోగాన్ని పెంచే దిశగా జలశక్తి మంత్రిత్వ శాఖ పని ప్రారంభించింది. దీని కింద గృహ వినియోగంలో నీటి వినియోగం సామర్థ్యాన్ని 50 నుంచి 60 శాతం పెంచవచ్చు.