ప్రతి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్న సవాళ్లు, ప్రభావాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ కార్యక్రమం. మానవుల పెరుగుతున్న జనాభా చాలా ఆందోళన కలిగించే విషయంగా పేర్కొనబడింది. అందుకే ప్రపంచ జనాభాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిణామాల వంటి ప్రబలమైన సమస్యలను విశ్లేషించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్‌ఐఏ భౌతిక, సైబర్‌స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) నివేదించింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో అపూర్వమైన శాంతి నెలకొందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.
లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ప్రకారం, ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా.. అజిత్ పవార్ కూడా హాజరవుతారు.
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ, గ్రామీణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. గత నెల ప్రారంభంలో పంచాయతీ ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఘర్షణల్లో 33 మందికి పైగా మరణించడంతో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.
కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా త్రివిద దళాల్లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వాళ్లని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి ఓపీ సోనీని విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. 2016 నుంచి 2022 వరకు అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో ఆయనను అధికారులు అరెస్ట్ చేశారు.