Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. భర్త అనారోగ్యంతో 2007లో ప్రాణాలు కోల్పోయాడు. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43)ను వివాహం చేసుకుంది. పిల్లలిద్దరినీ విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించేసింది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో.. ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పుట్టింటి వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్లను తీసుకొచ్చింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు.
Also Read: Crime News: దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. చెట్టుకు వేలాడదీసి..
ఆ బాలిక పదోతరగతికి రావడంతో ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 17 ఏళ్ల వయస్సులో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సతీష్ మగబిడ్డ కావాలని చెప్పడంతో తన రెండో కూతురు(16) ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఇటీవల సతీష్‌కు, ఆమెకు మధ్య గొడవలు రావడంకో తన పుట్టింటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఆ తర్వాత సతీష్ అతని వద్ద ఉన్న తన భార్య కూతుళ్లిద్దరినీ తీసుకుని వచ్చాడు. అక్కడ ఆమె లేకపోవడంతో కుమార్తెలిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలికల మేనమామ అక్కడకు చేరుకుని బాలికలను తీసుకెళ్లి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి పుట్టా సతీష్, అతని భార్యను అదుపులో తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు మూడో నెల గర్భిణీ అని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల జీవితాలతో ఆ కసాయి తల్లి ఆడుకుందని మండిపడుతున్నారు.