Anupama: కార్తికేయ 2 సెట్‌లో చేదు అనుభవం.. అసిస్టెంట్ చెప్పిన మాటతో అనుపమకు వాంతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, గతేడాది ‘కార్తికేయ-2’తో గ్లోబల్ హిట్ అందుకున్న అనుపమ, ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన గురించి తాజాగా వెల్లడించింది. తాను ఇన్నేళ్ల పాటు మటన్ ముట్టుకోకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Tamannah Bhatia: కేవలం అందం ఉంటే సరిపోదు.. తమన్నా బోల్డ్ కామెంట్స్!
Also Read
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
అనుపమ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ ‘కార్తికేయ-2’ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్‌లో ఒక చిన్న మేకపిల్ల ఉండేది, ఖాళీ సమయాల్లో ఆ మేకపిల్లతో ఎంతో ఇష్టంగా ఆడుకునేదాన్ని. అయితే, ఒకరోజు షూటింగ్ లంచ్ బ్రేక్‌లో యూనిట్ సభ్యులకు మటన్ బిర్యానీ వడ్డించారు,నేను కూడా ఎంతో ఇష్టంగా తింటుండగా నా అసిస్టెంట్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు.”మీరు ఇప్పుడు తింటున్న బిర్యానీలోని మాంసం.. మీరు ఇంతసేపు ఆడుకున్న మేకపిల్లదే” అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండే తరుకుపోయింది, అక్కడికక్కడే వాంతులు చేసుకున్నా. ఆ విషయం నను మానసికంగా ఎంతో గాయపరిచింది. ఆ క్షణం నుండి నాకు మటన్ అంటేనే అసహ్యం వేసింది. ‘కార్తికేయ-2’ షూటింగ్ పూర్తయినప్పటి నుంచి దాదాపు ఇన్నేళ్ల పాటు నేను మాంసాహారానికి (ముఖ్యంగా మటన్) దూరంగా ఉన్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజంట్ అనుపమ మాటలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!